Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎదుట కలకలం చోటుచేసుకుంది. అసెంబ్లీ వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు.. అసెంబ్లీ ముట్టడికి బీజేపీ కార్పొరేటర్లు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు.. బీజేపీ కార్పొరేటర్లను అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా జీహెచ్ఎంసీకి బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.