Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లి
కోకాకోలాతో భాగస్వామ్యంతో రియల్మీ భారత్‌లో రియల్మీ 10 ప్రొ కోకాకోలా ఎడిషన్‌ను లాంఛ్ చేసింది. డిజైన్, బ్యాక్ప్యానెల్పై కోకాకోలా బ్రాండింగ్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ కస్టమర్ల ముందుకొచ్చింది. సాఫ్ట్‌డ్రింక్ కంపెనీ ఈస్థటిక్స్ను పోలి ఉండేలా లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ లుక్‌ను తీర్చిదిద్దారు. చార్జర్, కేబుల్ సహా రియల్‌మి 10 ప్రొ కోకాకోలా ఎడిషన్ స్పెషల్ ప్యాకేజ్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. యువ కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని రూపొందిన ఈ ఫోన్ రెగ్యులర్ రియల్మీ 10 ప్రొను పోలిఉంది.
భారత్‌లో రియల్మీ 10 ప్రొ కోకాకోలా ఎడిషన్ ధర 8జీబీ ర్యాం వేరియంట్ రూ. 20,999. రియల్మీ ఛానెల్స్ ద్వారా లేటస్ట్ స్మార్ట్‌ఫోన్ ఫ్లాష్ సేల్ (పరిమిత సేల్) ప్రారంభమైంది. రియల్మీ 10 ప్రొ 5జీ కోకాకోలా ఎడిషన్ 33 డబ్ల్యూ చార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఏ హెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంది. 100ఎంపీ కెమెరా, 6.72 ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్ వంటి లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి.