Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ కోర్టు వచ్చే నెల 10వ తేదీకి వాయిదా వేసింది. వివేకా హత్య కేసు విచారణను కొద్దిరోజుల క్రితం ఏపీ నుంచి తెలంగాణకు సుప్రీంకోర్టు బదిలీ చేసిన విషయం తెలిసిందే. కేసు బదిలీ తరుణంలో సీబీఐ అధికారులు కడప జిల్లా సెషన్స్ కోర్టులో ఉన్న హత్య కేసుకి సంబంధించిన అన్ని ఫైళ్లు, ఛార్జ్ షీట్లు, సాక్షుల వాంగ్మూలాలు, దస్త్రాలను మూడు బాక్సుల్లో హైదరాబాద్ ప్రిన్సిపల్ సీబీఐ కోర్టుకు ఇప్పటికే తీసుకొచ్చారు.
కేసు విచారణలో భాగంగా నిందితులను పోలీసులు శుక్రవారం కడప నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారు. నిందితులు సునీల్ యాదవ్, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరితో పాటు మరో నిందితుడు ఉమాశంకర్‌రెడ్డిని సీబీఐ కోర్టులో హాజరు పరిచారు.