Authorization
Fri May 16, 2025 11:54:59 pm
నవతెలంగాణ - నాగపూర్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఇండియా రెండో రోజు టీ విరామ సమయానికి అయిదు వికెట్ల నష్టానికి 226 రన్స్ చేసింది. ప్రస్తుతం ఇండియా 49 పరుగుల ఆధిక్యంలో ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ 118, జడేజా 34 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు. ఆరో వికెట్‌కు రోహిత్, జడేజా మధ్య ఇప్పటికే 58 పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది. రోహిత్ ఈ మ్యాచ్‌లో కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. మేటి బ్యాటర్లు పెవిలియన్ బాట కట్టిన సమయంలో అతను క్రీజ్‌లో నిలదొక్కుకున్నాడు.