Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రయివేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల14 న ఉద్యోగ మేళా నిర్వహిస్తునట్లు జిల్లా ఉపాధి అధికారి శ్రీ సిరిమల శ్రీనివాస్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఇట్టి ఉద్యోగమేళాకు ముతూట్ ఫైనాన్స్ నిజామాబాద్ (MUTHOOT FINANCE Pvt) నిజామాబాద్ జిల్లా పరిధిలోనే జూనియర్ రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్/ (జూనియర్ రిలేషన్షిప్, ప్రొవిజినరీ ఆఫీసర్స్, ఇంటర్సిటీ ట్రైని, ఉద్యోగాలు తెలియజేశారు.
విద్యార్హత ఏదైనా డిగ్రీ ఎంబీఏ, ఎం కామ్, ఆ పైన వయోపరిమితి ల లోపు ఉండవలెను (జీతం అబో 17000/-) ఆసక్తి గల నిరుద్యోగ యువకులు ఉద్యోగమేళాలో జిల్లా ఉపాధి కార్యాలయం నిజామాబాద్ జిల్లాలో పాల్గొనాలని తెలిపారు. ఉదయం 10-00 గం లకు ఉపాధి కార్యాల శివాజీ నగర్ నిజామాబాద్ హాజరు వివరాలకు 9581768413,9959456793, వివరాలు బయో డేటా 2 ఆధార్ కార్డు 1 పాసుపోర్టు సైజు ఫోటో మీ యొక్క సర్టిఫికెట్స్ తో హాజరు కావాలన్నారు.