Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- హైదరాబాద్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయమే ప్రతికూలంగా ట్రేడింగ్ ప్రారంభించిన మార్కెట్లు రోజంతా అదే బాటలో పయనించాయి. ఏ దశలోనూ సూచీలకు కొనుగోళ్ల అండ లభించలేదు. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపాయి. దీనికి విదేశీ మదుపర్ల అమ్మకాలు జతయ్యాయి. ఎంఎస్‌సీఐలో అదానీ కంపెనీల షేర్ల వెయిటేజీ సమీక్ష కూడా నష్టాలకు కారణమైంది.
ఉదయం సెన్సెక్స్ 60,706.81 దగ్గర నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 60,774.14- 60,501.74 మధ్య కదలాడింది. చివరకు 123.52 పాయింట్ల నష్టంతో 60,682.70 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 17,847.55 దగ్గర ట్రేడింగ్ ప్రారంభించి ఇంట్రాడేలో 17,876.95- 17,801.00 మధ్య ట్రేడయ్యింది. చివరకు 36.95 పాయింట్లు నష్టపోయి 17,856.50 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.58 వద్ద నిలిచింది.