Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నాగ్పూర్
నాగపూర్ లో టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఆట చివరికి టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 7 వికెట్లకు 321 పరుగులు చేసింది. బ్యాటింగ్ కు కష్టసాధ్యమైన ఇక్కడి పిచ్ పై ప్రస్తుతానికి భారత్ కు 144 పరుగుల కీలక ఆధిక్యం లభించింది. రవీంద్ర జడేజా 66, అక్షర్ పటేల్ 52 పరుగులతో క్రీజులో ఉన్నారు.
గాయం నుంచి కోలుకుని దాదాపు 6 నెలల తర్వాత బరిలో దిగిన జడేజా బౌలింగ్ లో 5 వికెట్లు తీయడమే కాదు, బ్యాటింగ్ లోనూ అర్ధసెంచరీతో మెరిశాడు. 240 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన భారత్ ను జడేజా, అక్షర్ పటేల్ జోడీ ఆదుకుంది. ఇద్దరూ అర్ధసెంచరీలతో రాణించి జట్టుకు విలువైన పరుగులు జోడించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో టాడ్ మర్ఫీ 5, కెప్టెన్ పాట్ కమిన్స్ 1, నాథన్ లైయన్ 1 వికెట్ తీశారు. అంతకుముందు, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 177 పరుగులకు ఆలౌట్ అయింది.