Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14ను కౌ హగ్ డే గా జరుపుకోవాలని ఇటీవల కేంద్ర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. విమర్శలు వెల్లువెత్తడంతో బుధవారం జారీ చేసిన ఉత్తర్వును జంతు సంక్షేమ బోర్డు ఉపసంహరించుకుంది. కేంద్ర పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, ఫిషరీస్ మంత్రిత్వ శాఖ ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఫిబ్రవరి 14న కౌ హగ్ డే జరుపుకోవాలని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా జారీ చేసిన విజ్ఞప్తిని ఉపసంహరించుకుంటున్నాం’ అని బోర్డు కార్యదర్శి ఎస్కే దత్తా తెలిపారు.
అయితే జంతు సంక్షేమ బోర్డు జారీ చేసిన ఈ ఉత్తర్వుపై విమర్శలు వచ్చాయి. గోమాత అయిన ఆవును ఆ ఒక్క రోజే హగ్ చేసుకుని గౌరవించాలనడం తగదంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌తో సహా పలువురు నేతలు మండిపడ్డారు. ఆవును ఎల్లప్పుడూ ప్రేమించవచ్చంటూ సోషల్ మీడియాలో కూడా పోస్టులు వెల్లువెత్తాయి.ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఆ ఉత్తర్వును వెనక్కి తీసుకుంది.