Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రకటించిన హామీని నిలబెట్టుకోవాలి
ఈరోజు ముఖ్యమంత్రి కెసిఆర్ 11.5 లక్షల ఎకరాలకు పోడు హక్కు పత్రాలు ఇస్తామని స్పష్టంగా శాసనసభలో ప్రకటించడం హర్షణీయం. పోడు పట్టాలతో పాటు ఇతర సౌకర్యాలను కల్పిస్తామని చెప్పడం సంతోషం. ఇది గత కొంతకాలంగా సీపీఐ(ఎం), కమ్యూనిస్టులు, గిరిజనులు, సంఘాలు చేస్తున్న ఉద్యమ పోరాట ఫలితమే. ఇప్పటికైనా అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని ఖచ్చితంగా నిలబెట్టుకోవాలని, వెంటనే అమలు జరిగేట్టు చూడాలని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేస్తున్నది.
గిరిజనులు అడవులను అక్రమిస్తే పోడు పట్టాలను రద్దుచేస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. వాస్తవానికి అడవులను స్మగ్మర్లు, అవినీతి అటవీ అధికారులు, రాజకీయ నాయకుల అండతో నాశనం చేస్తున్నారు. గిరిజనుల వల్ల నాశనం కావడం లేదు. ఒకపక్క తెలంగాణలో గ్రీన్ కవర్ పెరిగింది, అడవి పెరిగింది అని స్వయంగా ముఖ్యమంత్రి చెపుతున్నదానికి విరుద్దంగా గిరిజనులే అడవులను నాశనం చేస్తున్నారని మాట్లాడటం సరైంది కాదు. ఆదివాసీలు ఉన్న ప్రాంతాలలో ఎక్కడా అడవి నాశనం కాలేదు. ఏమైనా అడవులను కాపాడుకోవడం గిరిజనులు, ప్రజలందరి బాద్యత వహించే విధంగా వుండాలి.
గుత్తికోయలు ఎక్కడినుండి వచ్చిన వారైనా చట్టప్రకారం హక్కు వుంటుంది. తప్పు చేసిన వారు ఎవరైనా వుంటే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. గుత్తికోయలను హక్కుదారులు కాదనడం సరైందికాదు. వారిపట్ట సానుకూలంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.