Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ముగ్గురు నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు. నాంపల్లిలోని సీబీఐ కోర్టులో ఐదుగురు నిందితులను అధికారులు హాజరుపర్చారు. ఏ2 సునీల్ యాదవ్, ఏ3 ఉమాశంకర్‌రెడ్డి, ఏ5 దేవిరెడ్డి శివశంకర్లను కడప జైలు నుంచి వాహనాల్లో హైదరాబాద్ తీసుకొచ్చారు. బెయిల్‌పై ఉన్న ఏ1 ఎర్ర గంగిరెడ్డితో పాటు సీబీఐకి అప్రూవర్‌గా మారిన ఏ4 దస్తగిరి కోర్టుకు వచ్చారు. ఐదుగురిని న్యాయస్థానం విచారించింది. ఆ తర్వాత రిమాండ్ ఖైదీలుగా ఉన్న ముగ్గురికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ మార్చి 10వ తేదీకి విచారణ వాయిదా వేసింది.
వివేకా హత్యకేసును సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నాంపల్లిలోని సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది. సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించిన తర్వాత తొలిసారి ఐదుగురు నిందితులు కోర్టు ఎదుట హాజరయ్యారు. రిమాండ్ ఖైదీలుగా ఉన్న ముగ్గురు నిందితులు కడప జైలులో ఉన్నప్పటికీ ప్రస్తుతం నాంపల్లి సీబీఐ కోర్టు విచారణ చేపట్టినందున ముగ్గురినీ చంచల్‌గూడ జైలుకు రిమాండ్‌కు తరలించారు.