Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
కాంగ్రెస్ ఎంపీ రజనీ పాటిల్‌ను రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్ఖర్ సస్పెండ్ చేశారు. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందన్నారు. సభా కార్యక్రమాలను రికార్డు చేయడంపై చైర్మన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సభా కార్యకలాపాలను రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టడంపై తీవ్రంగా రాజ్యసభ చైర్మన్ తీవ్రంగా పరిగణించారు.
ఈ వ్యవహారంపై స్పందిస్తూ ప్రివిలిజేస్ కమిటీ విచారిస్తుందని, సభ పరిశీలనకు ప్రివిలేజెస్ కమిటీ నివేదిక సమర్పించే వరకు రజనీ పాటిల్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ తరుణంలో రజనీ పాటిల్ స్పందిస్తూ తాను అలాంటివేమీ చేయలేదరని, అయినా నాకు ఉరిశిక్ష విధించారన్నారు. తాను స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చానని, చట్టాలను ఉల్లంఘించడానికి మా సంస్కృతి నన్ను అనుమతించదని, నిన్న రాజ్యసభలో ప్రధాని మోడీ సమాధానం ఇస్తుండగా అడ్డుకున్నామని, అందుకే ఆగ్రహంతో ఈ చర్య తీసుకున్నారని ఆరోపించారు.