Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చంచల్గూడ
హైదరాబాద్లో ఎంజీబీఎస్ - చాదర్ఘాట్ రహదారిపై భారీ గుంత ఏర్పడింది. వెంటనే సమాచారం అందుకున్న జలమండలి అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని గుంతను పరిశీలించారు. దాదాపు 20 అడుగుల లోతు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
ఈ తరుణంలో నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో ఇప్పటికిప్పుడు గంతను తవ్వి మరమ్మతులు చేయడం సాధ్యం కాదని అలా చేస్తే పెద్ద ఎత్తున ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతాయని అధికారులు తెలిపారు. రాత్రికి ఎంజీబీఎస్ - చాదర్ఘాట్ మార్గంలో రాకపోకలు నిలిపివేసి మరమ్మతులు కొనసాగిస్తామన్నారు. ప్రస్తుతం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గుంత పడిన ప్రాంతంలో మలక్పేట ట్రాఫిక్ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను నియంత్రిస్తూ ప్రయాణికులను అప్రమత్తం చేస్తున్నారు.