Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : పెండ్లి చేసుకుంటానని నమ్మించి ఆమె డబ్బులు తీసుకొని మోసం చేసిన యువకుడిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. నగరానికి చెందిన యువతి ఓ సంస్థలో హౌస్ కీపింగ్ విభాగంలో పనిచేస్తుంది. కొన్ని రోజుల క్రితం ఎలక్ర్టీషియన్ బోలగాణి రమే్‌షతో పరిచయం ఏర్పడింది. ప్రేమిస్తున్నాని వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆమె కూడా ఒప్పుకుంది. ఆర్థిక అవసరాలు ఉన్నాయంటూ రమేష్ ఆమె వద్ద రూ.2 లక్షలు తీసుకున్నాడు. ఆ తరువాత ఆమెను ఫిలింనగర్‌కు తీసుకువెళ్లి శారీరకంగా వాడుకున్నాడు. ఇలా పలుమార్లు ఇద్దరు కలిశారు. తనను వివాహం చేసుకోవాలని యువతి అడగగా ముఖం చాటేయడం మొదలు పెట్టాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.