Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తిరుపతి జిల్లా నాయుడుపేట సమీపంలోని మేనకూరు పారిశ్రామికవాడ వద్ద గ్యాస్ పైప్లైన్ పేలుడు కలకలం సృష్టించింది.. గ్యాస్ పైప్లైన్ పేలడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రయోగాత్మకంగా ఇంటింటికి గ్యాస్ ను అందించేందుకు అదానీ కంపెనీకి చెందిన ఏజీ అండ్ పీ అనే కంపెనీ పైప్ లైన్ల నిర్మాణం చేపట్టింది.. ఇక, ఇందులో భాగంగా ట్రయల్ పద్ధతిలో గాలిని పైపుల్లో నింపుతుండగా ఒత్తిడికి తట్టుకోలేని పైపులు ఒకసారిగా పగిలాయని చెబుతున్నారు.. దీంతో భారీ శబ్దం రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. పైపులను శుభ్రపరిచే ప్రక్రియలో భాగంగా గాలిని నింపుతుండగా పైపులు పగిలాయని పోలీసులు తెలిపారు.. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.