Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న పోలీసులపై అకారణంగా దాడికి దిగిన ముగురికి న్యాయస్థానం ఆరు నెలల జైలు శిక్ష విధించింది. నాంపల్లి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో హోం గార్డ్‌గా విధులు నిర్వహించే జనార్దన్ 2018 అక్టోబర్ 8న రెడ్‌హిల్స్‌లోని ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి వద్ద డ్యూటీ చేస్తుండగా అటుగా ముగ్గురు వ్యక్తులు ఒకే ద్విచక్ర వాహనంపై వచ్చారు. అక్కడే ఉన్న హోంగార్డ్ జనార్దన్ తన కెమెరా ద్వారా వాహనాన్ని ఫొటో తీశాడు. అది గమనించి సదరు వాహన దారుడు గౌస్ ఖాన్ తన స్నేహితులైన జాఫర్ ఖాన్, సాబేర్ ఖాన్‌తో కలిసి హోంగార్డ్ జనార్దన్ వద్దకు వచ్చి ఫొటో ఎందుకు తీశావంటూ దాడి చేసి పారిపోయే ప్రయత్నం చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి ఆధారాలతో నిందితులను నాంపల్లి కోర్ట్ ఎదుట హాజరుపరుచగా న్యాయస్థానం గౌస్ ఖాన్, జాఫర్ ఖాన్, సాబేర్ ఖాన్‌కు ఆరు నెలలు జైలు శిక్ష విధించింది. విధులకు ఆటంకం కలిగించే వారిపై చర్యలు తప్పవని నాంపల్లి ఇన్స్పెక్టర్ రాజు నాయక్ హెచ్చరించారు.