Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి మరో ప్రముఖ వ్యక్తిని ఈడీ అరెస్టు చేసింది. ఏపీకి చెందిన ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో ప్రశ్నించాక అరెస్టు చేసినట్లు ఈడీ వెల్లడించింది. ఇవాళ మధ్యాహ్నం రాఘవను ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. మాగుంట రాఘవను కూడా కస్టడీకి తీసుకునేందుకు కోర్టు అనుమతి కోరనున్నట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. వారం రోజుల వ్యవధిలో ఈడీ అధికారులు ఇద్దరిని అరెస్టు చేశారు.