Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశంలో బంగారం ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఇటీవల కొద్ది రోజుల పాటు ధరలు తగ్గడంతో కొనుగోలుదారులంతా సంతోషించారు. ఆ సంతోషం ఎన్నో రోజులు నిలవలేదు. నిన్నటి నుంచి తిరిగి బంగారం పరుగు ప్రారంభించింది. బంగారాన్ని పెట్టుబడిగా భావించి కొనుగోలు చేసిన వారికి ఇది గుడ్ న్యూసే. కానీ కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి మాత్రం షాక్. నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.200 మేర పెరిగి రూ.52,600కి చేరుకోగా.. 24 క్యారెట్ల బంగారంపై రూ.220 మేర పెరిగి.. రూ. 57,380కి చేరుకుంది. నేడు కేజీ వెండి ధర రూ.72,700లకు చేరుకుంది.