Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: కేరళ రాష్ట్రంలోని మహారాజ కళాశాల యూత్ ఫెస్టివల్ పూర్వ విద్యార్థుల పెండ్లికి వేదికైంది. మట్టన్చెర్రీకి చెందిన నదీం, పనంగాడ్కు చెందిన కృప ఇద్దరూ ఎర్నాకులంలోని మహారాజ కళాశాలలో 2014-17 మధ్య గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కుటుంబ సభ్యుల అనుమతితో వివాహ బంధంతో ఒక్కటవ్వాలనుకున్న వారికి నిరాశే ఎదురైంది. ఇరు కుటుంబ సభ్యులు వారి పెండ్లికి నిరాకరించారు. ఒకరిని ఒకరు ప్రాణంగా ప్రేమించుకున్న వీరు పెండ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో వారి ప్రేమకు వేదికైన కళాశాలలోనే వివాహం చేసుకున్నారు. కళాశాలలో జరిగిన యూత్ ఫెస్టివల్ వేదికగా వేలాదిమంది విద్యార్థుల సమక్షంలో దండలు మార్చుకొని ఒక్కటయ్యారు. అనంతరం రిజిస్టర్ ఆఫీస్కు వెళ్లి తమ వారి వివాహాన్ని నమోదు చేసుకున్నారు.