Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ న్యూఢిల్లీ: విశ్వంలో జరిగిన ఓ అసాధారణ పరిణామం ప్రపంచానికి ఉలికిపాటుకు గురిచేసింది. సూర్యుడి నుంచి కొంత భాగం వేరు పడినట్టు నాసాకు చెందిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియోను అంతరిక్ష శాస్త్రవేత్త డా తమిత స్కోవ్ ట్వీట్ చేశారు. సూర్యుడి నుంచి విడిపోయిన భాగం ఉత్తర ధ్రువం వద్ద సుడులు తిరుగుతున్నదని, సెకనుకు 96 కిలోమీటర్ల వేగంతో ఇది కదులుతున్నదని నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. సాధారణంగా సూర్యుడి నుంచి భారీ సౌర మంటలు విరజిమ్ముతుంటాయి. ఇవి ఒక్కోసారి భూమి మీద సమాచార వ్యవస్థలపై ప్రభావం చూపిస్తాయి. అలాంటిది తాజాగా ఒక భారీ భాగం సూర్యుడి నుంచి వేరు పడటం ఎలాంటి ప్రభావం చూపిస్తుందో విశ్లేషించే పనిలో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు.