Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
భారత మోటార్ స్పోర్ట్స్‌లో కొత్త అధ్యాయానికి హైదరాబాద్ వేదికైంది. ఫార్ములా వన్ తర్వాత ఎక్కువ ఆదరణ దక్కించుకుంటున్న ఫార్ములా-ఈ ప్రపంచ ఛాంపియన్షిప్ నగరంలో మొదలైంది. నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన రేసింగ్ సర్క్యూట్లో ఫార్ములా-ఈ రేసు కార్లు దూసుకుపోతున్నాయి. వివిధ దేశాల నుంచి వచ్చిన రేసర్లు వాయు వేగంతో కార్లలో దూసుకుపోతున్నారు. జాగ్వార్, నిస్సాన్, కప్రా, అవలాంచ్, మహింద్రా కార్లు ట్రాక్ పై దుమ్ము రేపుతున్నాయి. ప్రస్తుతం క్వాలిఫైయింగ్ రేస్ కొనసాగుతుండగా మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాన రేస్ ఉంటుంది. ఈ తరుణంలో మొత్తం 2.8 కిలోమీటర్ల స్ట్రీట్ సర్క్యూట్లో 11 ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలకు చెందిన 22 మంది రేసర్లు రేస్‌లో పాల్గొంటున్నారు.
దీంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, క్రికెటర్లు సైతం రేస్‌ను తిలకించేందుకు హైదరాబాద్ వచ్చారు. క్రికెటర్లు సచిన్ తెందూల్కర్, శిఖర్ ధావన్, దీపక్ హుడా, యజువేంద్ర చాహల్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ రేస్‌ను తిలకిస్తున్నారు. రాజకీయ ప్రముఖులు మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్, ఎంపీ రామ్మెహన్ నాయుడు, గల్లా జయదేవ్, నటుడు రాంచరణ్ హాజరయ్యారు.