Authorization
Fri May 16, 2025 08:07:03 pm
నవతెలంగాణ హైదరాబాద్: బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో టీమ్ ఇండియా శుభారంభం చేసింది. నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆసీస్‌పై భారత్ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 321/7 (తొలి ఇన్నింగ్స్) ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. మరో 79 పరుగులు జోడించి 400 పరుగులు చేసి ఆలౌటైంది. ఈ క్రమంలో 223 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ భారత స్పిన్నర్ల ధాటికి 91 పరుగులకే కుప్పకూలిపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో (3/42)తో ఆకట్టుకున్న అశ్విన్.. రెండో ఇన్నింగ్స్‌లో (5/37).. తన స్పిన్ మాయాజాలంతో ఆసీస్ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో (5/47)తో అదరగొట్టిన జడేజా.. రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు 16 వికెట్లు పడగొట్టారు.