Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢీల్లి
ఇటీవలి బడ్జెట్లో కొత్త పన్ను విధానంలో కేంద్రం మార్పులు చేసిన విషయం తెలిసిందే. రూ.3 లక్షల వరకు ఎలాంటి పన్నూ ఉండబోదని ప్రకటించింది. రూ.3-6 లక్షలు ఆదాయంపై 5 శాతం రూ.6-9 లక్షలపై 10 శాతం; రూ.9-12 లక్షలపై 15 శాతం; రూ.12-15 లక్షలపై 20 శాతం; రూ.15 లక్షలపై 30 శాతం పన్ను విధిస్తామని తెలిపింది. అలాగే రూ.7లక్షల వరకు ఎలాంటి పన్నూ ఉండదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
ఈ క్రమంలో ఆర్బీఐ బోర్డుతో నిర్వహించిన సమావేశం అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. కొత్త ఆదాయపు పన్ను విధానం వల్ల మధ్య తరగతికి మేలు చేకూరుతుందని, చేతిలో డబ్బులు మిగిల్చే ఉద్దేశంతోనే దీనిని తీసుకొచ్చినట్లు తెలిపారు. పెట్టుబడి విషయంలో వ్యక్తులకు స్వేచ్ఛ ఇస్తున్నట్లు తెలిపారు. క్రిప్టో విషయంలో కామన్ ఫ్రేమ్‌వర్క్ రూపొందించేందుకు జీ20 దేశాలతో చర్చిస్తున్నామని తెలిపారు.