Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ నాగ్పూర్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. భారత స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో 3 వికెెట్లు, రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లు మొత్తంగా 8 వికెట్లు సాధించాడు. దీంతో టెస్టుల్లో ఆస్ట్రేలియా జట్టుపై అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్గా అశ్విన్ రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు ఆస్ట్రేలియాపై 19 టెస్టులు ఆడిన అశ్విన్ 97 వికెట్లు సాధించాడు.