Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే 317 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బాధిత ఉపాధ్యాయులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. విడతల వారీగా ఉపాధ్యాయులు అసెంబ్లీ ముట్టడికి యత్నించడంతో పోలీసులు ఎక్కడికక్కడ ఆందోళనకారులను నిలువరించారు. ఈ తరుణంలో ఉపాధ్యాయులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
317 జీవో వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వందల కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తోందని వాపోయారు. కుటుంబానికి దూరం అవుతున్నామని, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు.