Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
సికింద్రాబాద్‌లోని వారసిగూడ కూడలి వద్ద స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. స్థానిక ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ తరుణంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానని తన కుటుంబాన్ని బంగారంగా మార్చుకున్నాడని మండిపడ్డారు.
కేసీఆర్ అధికారంలో ఉన్నన్ని రోజులు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వచ్చే అవకాశమే లేదన్నారు. డబ్బుతో రాజకీయం చేయడం కేసీఆర్‌కు అలవాటుగా మారిందని విమర్శించారు. సికింద్రాబాద్‌లో సరైన రహదారులు, నీళ్లు, నియామకాలు, డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లు, పింఛన్లు రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్య ప్రభుత్వం లేదని, కల్వకుంట్ల అవినీతి పాలన యథేచ్చగా సాగుతుందన్నారు.