Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-లక్నో: పెండ్లి వేడుకలో విషాదం జరిగింది. ఇద్దరు పిల్లలు కోట్లాడుకోగా ఒక బాలుడు మరణించాడు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నవాబ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతంలో గురువారం ఒక జంటకు పెండ్లి జరిగింది. వధూవరులు దండలు మార్చుకుంటుండగా డీజే ఫ్లోర్ వద్ద పిల్లలు డ్యాన్స్ చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు పిల్లల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో 12 ఏళ్ల బాలుడు, 11 ఏళ్ల బాలుడ్ని డీజే వేదిక నుంచి తోశాడు. ఆగ్రహించిన 11 ఏళ్ల బాలుడు సాస్ బాటిల్ తీసుకుని 12 ఏళ్ల బాలుడి తలపై కొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆ బాలుడ్ని ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ చనిపోయాడు.
కాగా, మరణించిన పిల్లాడిని కమల్ కుమార్‌గా గుర్తించారు. రత్నా నంద్పూర్ గ్రామానికి చెందిన ఆ బాలుడు ఐదో తరగతి చదువుతున్నాడు. చిన్న రైతు అయిన కమల్ తండ్రి హరిశంకర్ దివాకర్, తన కుమారుడి మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో 11 ఏళ్ల బాలుడిపై ఎస్సీ, ఎస్టీ చట్టంతోపాటు, 12 ఏళ్ల కమల్ మరణానికి సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశాడు. నిందిత బాలుడ్ని జువెనైల్ హోమ్‌కు తరలించారు.