Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆలిండియా లాయర్స్ యూనియన్ బృందం
నవతెలంగాణ రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి గ్రామంలో చుట్టు ప్రక్కల గ్రామాలకు చెందిన ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న కిసాన్ ఆగ్రో ఫీడ్స్ కంపెనీని ఆలిండియా లాయర్స్ యూనియన్ (ఐలు) రాష్ట్ర బృందం ఈ రోజు సందర్శించి గత 10 రోజులుగా చేస్తున్న దీక్షలకు మద్దతు తెలియసింది. అనంతరం కంపెనీలోకి వెళ్ళి సమస్యలను అధ్యయనం చేసింది. అందులో ఉత్పత్తి అయిన కోళ్లకు, చేపలకు వేసే ఫీడ్, డాల్టా నూనె, టీ పౌడర్ దేశంలోని అన్ని ప్రాంతాలకు సప్లయి అవుతున్నది. ఇవి తిన్న ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు. ఈ కంపెనీ వల్ల చుట్టు ప్రక్కల ఉన్న 45-60 యేళ్ళ వయస్సున్న వ్యక్తులు గత మూడేళ్ళుగా 150 మంది చనిపోయారు. వీరికి ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నాయో కూడా తెలియడం లేదు. ఇంతటి ప్రమాదకరమైన కంపెనీని పోల్యూషన్, ఎస్వోటీ, పోలీస్ డిపార్టుమెంట్ వారు పట్టించుకోకపోవడం సరైందికాదని, తక్షణమే ఆ కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకుని, కంపెనీని పూర్తిగా ఎత్తివేయాలని ఆలిండియా లాయర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. ఆందోళన చేస్తున్న ప్రజలకు న్యాయపరంగా అన్ని విధాలా సలహాలు, సూచనలు ఇస్తూ, ఉద్యమంలో పాలుపంచుకుంటూ తనవంతు కృషి చేస్తామని పేర్కొంటున్నది.
కొత్తపల్లి గ్రామం శ్రీ వెంకటేశ్వరస్వామి స్వామి గుడి ప్రక్కన కిసాన్ ఆగ్రో ఫీడ్స్ కంపెనీలో పశువుల యొక్క కుళ్లిపోయిన మాసం, వ్యర్త పదార్థాలు నిల్వ ఉంచి వీటి ద్వారా కల్తీ వంటనూనె, ఫీడు తయ్యారు చేస్తున్నారు. ఈ వ్యర్థాల నిల్వ వల్ల చుట్టు ప్రక్కల గ్రామాలైన కొత్తపల్లి, తక్కళ్లపల్లి, తమ్మలోనిగూడ, కేశనాములపల్లి గ్రామాల్లోని చిన్నపిల్లలు, వృద్దులు, ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గువుతూ మరణిస్తున్నారు.
ఈ కంపెనీకి ఇరువైపుల సుమారు 300 ఎకరాలు రైతులు సాగుచేసుకుంటున్న భూములు ఉన్నాయి. వీరికి వ్యవసాయమే జీవనాధారం. ఈ వాసనవల్ల రైతులు వ్యవసాయం చేయలేకపోతున్నారు. అక్కడక్కడ చేసినా కూలీలు కూడా ఈ ప్రాంతాలకు రావడం లేదు. దీంతో వీరి బ్రతుకులు రోడ్డునపడ్డాయి. చుట్టు ప్రక్కల గ్రామాల్లో ప్రజలు నివసించలేకపోతున్నారు. ఈ కంపెనీలో తయ్యారైన వంట నూనెలు దేశవ్యాపితంగా సరఫరా చేస్తున్నారు. ఇది వాడిన ప్రజలు కూడా తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు.
దీంతో గ్రామస్తులు 14.12.2016న అప్పటి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లగా, 24.04.2017న ఈ కంపెనీని మూసివేయించారు. అయినా యాజమాన్యం జనరేటర్ సహాయంతో మళ్ళీ కల్తీ ఆయిల్ తయ్యారు చేసారు. ఎస్వోటీ పోలీస్ డిపార్ట్మెంట్వారు ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేసారు. అనేక మీడియాల్లో కూడా ప్రసారమయ్యాయి. ఇంత ప్రమాకరమైన కంపెనీని పొల్యూషన్ డిపార్టుమెంట్ అధికారులు 05.10.2017న తిరిగి రీఓపెన్ చేసారు. మళ్ళీ జిల్లా కలెక్టర్ మరియు సెంట్రల్ పీసీబీ Ê నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లగా 20.02.2020న మళ్ళీ మూసివేసినా, తిరిగి 05.06.2020న మళ్ళీ రీ ఓపెన్ చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు తనీఖీకి వచ్చినప్పుడు సుగుంద ద్రవ్యాలు చల్లి వీరి దందా బయటపడకుండా కప్పిపుచ్చుకుంటున్నారు. ఈ కంపెనీ పైకి మాత్రమే కిసాన్ అగ్రో ఫీడ్స్ కంపెనీ, కానీ లోతుకు వెళ్ళి గమనిస్తే మొత్తం అక్రమాల కంపెనీ. ఈ విషయంపై గ్రామంలో ఎలాంటి గ్రామ సభ కూడా నిర్వహించకుండా ఇలాంటి ప్రమాదకరమైన కంపెనీని ఎలా ఓపెన్ చేస్తున్నారో అర్థ కావడంలేదు. తక్షణమే అనుమతులను రద్దు చేసి, కంపెనీని మూసివేయాలని ఆలిండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది.