Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ నెల్లూరు: నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు వాహనాలతో మంటలు ఆర్పుతున్నారు. రెండో శనివారం సెలవు కావడంతో సిబ్బంది ఎవరూ విధుల్లో లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో కలెక్టరేట్లో భద్రపరిచిన ఎన్నికల సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.