Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - టర్కీ
తుర్కియేలోని మాలత్య నగరంలో భూకంప ప్రభావిత ప్రాంతం నుంచి ఓ భారతీయుడి మృతదేహాన్ని వెలికితీశారు. తుర్కియేలోని భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. మృతుడిని ఉత్తరాఖండ్‌కు చెందిన విజయ్ కుమార్‌గా గుర్తించింది. ఆయనో వ్యాపారవేత్త అని, బిజినెస్ ట్రిప్ మీద మాలత్యకు వచ్చినట్లు తెలిపింది. భూకంప ఘటన నాటినుంచి ఆచూకీ లేకుండా పోయారని, తాజాగా ఇక్కడి ఓ హోటల్ శిథిలాల్లో ఆయన మృతదేహం బయటపడినట్లు వెల్లడించింది. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తూ.. భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.