Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చండీగఢ్: పర్యావరణ అనుకూల రవాణావ్యవస్థ దిశగా విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేందుకు చండీగఢ్ పాలనాయంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌తో నడిచే ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్లను తాత్కాలికంగా నిలిపేసింది. ఫిబ్రవరి 10 నుంచి ఈ నిషేధాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. గతేడాది సెప్టెంబరులో ప్రవేశపెట్టిన ‘విద్యుత్ వాహనాల విధానం'లో భాగంగా ఈ మేరకు చర్యలు తీసుకుంది. విద్యుత్ వాహనాలు కాని వాటిని పరిమితం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికార యంత్రాంగం పేర్కొంది. ఈ క్రమంలోనే నాన్ ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్లను పరిమితం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23)లో గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. నాలుగు చక్రాల వాహనాల్లో 10 శాతం, ద్విచక్ర వాహనాల్లో 35 శాతం రిజిస్ట్రేషన్లను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవలే ఇది పూర్తికావడంతో.. ఫిబ్రవరి 10 నుంచి రిజిస్ట్రేషన్లను నిలిపేసింది. ఫిబ్రవరి 10, ఆపై కొనుగోలు చేసిన ఇంధన ఆధారిత ద్విచక్ర వాహనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేవరకు(మార్చి 31) చండీగఢ్‌లో రిజిస్ట్రేషన్ చేయబోమని పాలనాయంత్రాంగం తేల్చిచెప్పింది. ఏప్రిల్ 1 నుంచి ఈ ప్రక్రియ పునఃప్రారంభం అవుతుందని వెల్లడించింది.