Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : అసఫ్ జాహీ వంశం తొమ్మిదో నిజాంగా నవాబ్ రౌనఖ్ యార్ ఖాన్ ఎంపికయ్యారు. ఈ మేరకు మజ్లిస్ఉఎఉషబ్జాదేగన్ సొసైటీ ప్రతినిధులు శనివారం ప్రకటించారు. ఎనిమిదో నిజాం నవాబ్ మీర్ బర్ఖత్ అలీఖాన్ మృతి అనంతరం తమ కుటుంబ సంప్రదాయాల ప్రకారం తొమ్మిదో నిజాంను ఎంపిక చేయడం జరిగిందని ఈ సందర్భంగా వారు తెలిపారు. అమీర్‌పేటలోని మ్యారీగోల్డ్ హోటల్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో సొసైటీ అధ్యక్షుడు షెహజాదా మీర్ ముజ్తాబా అలీఖాన్, ఉపాధ్యక్షుడు మీర్ నిజాముద్దీన్ అలీఖాన్, ప్రధాన కార్యదర్శి మహ్మద్ మొయిజుద్దీన్ ఖాన్ వివరాలను వెల్లడించారు. 4,500 మంది నిజాం కుటుంబ సభ్యులతో కూడిన సొసైటీ పక్షాన తమ సమస్యలను ప్రభుత్వానికి సమర్థవంతంగా నివేదించగలరన్న పూర్తి విశ్వాసంతో తొమ్మిదో నిజాంగా నవాబ్ రౌనఖ్ యార్ఖాన్ను ఎంపిక చేసుకోవడం జరిగిందన్నారు.