Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
విస్సన్నపేట మండలంలోని కొండపర్వలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీని కారు ఢీకొట్టింది. విస్సన్నపేట మండలం కొండపర్వ గ్రామ శివారు దగ్గర శనివారం అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. బాధితుడిని దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులు విస్సన్నపేటకు చెందిన ఆర్యవైశ్యులు కొత్తాలాల్ గుప్తా, సునీతగా పోలీసులు గుర్తించారు.