Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
అసెంబ్లీ సమావేశాల్లో మండలిలో చర్చ తరుణంలో మెట్రో రైలును ఎల్బీనగర్ నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ వరకు, నాగోల్ నుంచి ఎయిర్ పోర్టు వరకు విస్తరించాలని ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం కోరారు. మరో ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ ఓల్డ్ సిటీకి మెట్రో ఉందా..? అని, మెట్రో ఛార్జీలు పెంచాలని భావిస్తున్నా..? అని ప్రశ్నించారు. వీటికి మంత్రి కేటీఆర్ స్పందించి సమాధానం ఇచ్చారు.
హైదరాబాద్ లో మొత్తం 69 కిలోమీటర్ల మేర మెట్రో ఉందని గతంలో మెట్రో మొత్తం పీపీపీతో నడిచిందని ఇప్పుడు రహేజ ఐటీ పార్కు నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు మెట్రో రైలును అందుబాటులోకి తీసుకువస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇది రాష్ట్రప్రభుత్వమే చేపడుతున్న ప్రాజెక్ట్ అని, లక్డీకపూల్ నుంచి బీహెచ్ఈఎల్ మెట్రో మూడో దశ కూడా త్వరలో చేపడుతామని వెల్లడించారు.
అంతే కాకుండా ఓల్డ్ సిటీకి మెట్రోకు ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించామని కేంద్రం కనీసం తెలంగాణపై కనికరం చూపెట్టడం లేదని మండిపడ్డారు. ముంబై, గుజరాత్, తమిళనాడులో మెట్రోకు నిధులు ఇచ్చారు కానీ తెలంగాణకు పైసా ఇవ్వడం లేదని అన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ వరకు మెట్రో పొడగింపు విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు.