Authorization
Fri May 16, 2025 02:08:09 pm
నవతెలంగాణ - హైదరాబాద్
శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ ముదిరాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈమేరకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. ఈ తరుణంతో బండ ప్రకాశ్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ మండలి డిప్యూటీ చైర్మన్‌గా బండ ప్రకాశ్ ఏకగ్రీవంగా ఎన్నికవడం తమకెంతో ఆనందదాయకమని, మంచి విద్యాధికులుగా పేరు తెచ్చుకున్నారని, విద్యార్థిగా ఉంటూనే రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారని తెలిపారు.
కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టడం గర్వకారణమన్నారు. ఆయన సేవలు తెలంగాణ ప్రజానీకానికి ఎంతో అవసరమని, డిప్యూటీ చైర్మన్‌గా సభలో ఫలవంతమైన చర్చలకు అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాని తెలిపారు. ఇదే క్రమంలో మండలి డిప్యూటీ చైర్మెన్‌గా ఎన్నికైన బండ ప్రకాశ్‌ను మంత్రి కేటీఆర్ హృదయపూర్వకంగా అభినందించారు. ఆయన అనుభవం సభకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాన్నారు.