Authorization
Sat May 17, 2025 12:06:01 am
నవతెలంగాణ-హైదరాబాద్ : వారంతపు సెలవు దినం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కొండపై ఉన్న కంపార్ట్‌మెంట్లు అన్ని నిండిపోయాయి. భక్తులు టీబీసీ వరకు క్యూలైన్లో నిలిచియున్నారు. నిన్న స్వామివారిని 75,728 మంది భక్తులు దర్శించుకోగా 38,092 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.15 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. టోకెన్లు లేని భక్తులకు 30 గంటల సర్వదర్శనం కలుగుతుందని తెలిపారు.