Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఆదివారం కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తర సమయంలో సమీకృత మార్కెట్లపై వేసిన ప్రశ్నకు సమాధానంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఒకప్పుడు కూరగాయలు పండించే విధానం చాలా దుర్భరంగా ఉండేదన్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కూరగాయలు పండించే విధానం కూడా సరిగా లేదన్నారు.
ఈ క్రమంలో మోండా మార్కెట్ ను చాలా సైంటిఫిక్ గా కట్టారని, ప్రతి నియోజకవర్గంలో ఆధునిక మార్కెట్లు ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు. హైదరాబాద్‌లోనూ చాలా చోట్ల కొత్త మార్కెట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు మోండా మార్కెట్‌ను చూపించామని, అన్నిచోట్ల ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను వేగంగా నిర్మిస్తున్నామన్నారు. 120 ఏళ్ల కిందట కట్టిన మార్కెట్లో మాంసం, కూరగాయలు ఒకే దగ్గర అమ్మినా పరిశుభ్రంగా ఉంటుందన్నారు.