Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-న్యూఢిల్లీ: ఢిల్లీ నగర మేయర్ ఎన్నిక ఈ నెల 16న జరగనుంది. ఫిబ్రవరి 16న ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్‌ను కొలువుదీర్చి నూతన మేయర్ ఎన్నిక నిర్వహించాలంటూ సీఎం కేజ్రివాల్ చేసిన ప్రతిపాదనకు లెఫ్టినెంట్ జనరల్ వీకే సక్సేనా ఆమోదం తెలిపారు. దాంతో ఈ నెల 16న ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ సమావేశమై నూతన మేయర్‌ను, డిప్యూటీ మేయర్‌ను, ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకోనుంది. ఈ మేరకు ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్ వీకే సక్సేనా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 16న ఉదయం 11 గంటలకు డాక్టర్ ఎస్పీ ముఖర్జి సివిక్ సెంటర్లోని A బ్లాక్, 4వ అంతస్తులో ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ సమావేశమవుతుందని, ఆ సమావేశంలోనే మేయర్, డిప్యూటీ మేయర్, ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక జరుగుతుందని, ఈ మేరకు సీఎం చేసిన సిఫారసుకు తాను ఆమోదం తెలిపానని ఎల్జీ సక్సేనా తన ప్రకటనలో పేర్కొన్నారు.