Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైన బండా ప్రకాశ్‌ను రాష్ట్ర మంత్రులు అభినందించారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్ తో పాటు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి శాసన మండలిలో బండా ప్రకాశ్‌ను కలిసి శాలువాతో సన్మానించారు. పుష్పగుచ్చాలను అందజేసి అభినందించారు. మంత్రి తలసాని మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీసీలంటే అమితమైన ప్రేమ అని అన్నారు. సంక్షేమం, అభివృద్ధిలో బీసీలకు ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారని, రాజకీయ పదవులలోనూ వారికే అగ్రతాంబూలం ఇస్తున్నారన్నారని పేర్కొన్నారు. అందుకు నిదర్శనం బీసీ నేతకు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవి కట్టబెట్టడం అన్నారు.