Authorization
Tue April 29, 2025 01:42:23 pm
నవతెలంగాణ - తిరుమల
తిరుమల శ్రీవారి భక్తులకు అదిరిపోయే శుభవార్త అందింది. తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఫిబ్రవరి 23 నుంచి 28వ తేదీ వరకు సంబంధించిన రూ. 300 ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లు ఇవాళ ఉదయం తొమ్మిది గంటలకు టీటీడీ ఆన్లైన్ లో విడుదల చేయనుంది. భక్తులు యాప్ ద్వారా బుక్ చేసుకోవాలని సూచించింది.
అంగ ప్రదక్షిణం టోకెన్లు: మార్చి నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాతో పాటు, ఈనెల 23 నుంచి 28 తేదీ వరకు సంబంధించిన టోకెన్లను శనివారం ఉదయం 11 గంటలకు ఆన్లైన్ లో విడుదల చేయనుంది. 14న వృద్ధులు, వికలాంగుల కోట టోకెన్లు: శ్రీవారి దర్శనానికి సంబంధించి వృద్ధులు, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉచిత టోకెన్ల కోటాను ఈనెల 14న ఆన్లైన్ లో విడుదల చేయనున్నారు.