Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 40 శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు టీఎస్ ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. మొత్తం 2,427 బస్సులను ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. శ్రీశైలం పుణ్యక్షేత్రానికి 578 ప్రత్యేక బస్సులు, ఏడుపాయలకు 497, వేములవాడకు 481 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులను భక్తులు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.