Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించనున్నారు. కేసీఆర్తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ కూడా సిద్దిపేటలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కొండపోచమ్మ రిజర్వాయర్, మర్కుక్ పంప్ హౌస్, పాండవుల చెరువును పరిశీలించనున్నారు పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, పంజాబ్ రాష్ట్ర అధికారులు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. మధ్యాహ్నం పర్యటన ముగించుకుని తిరిగి హైదరాబాద్ బయల్దేరనున్నారు పంజాబ్ సీఎం భగవంత్ సింగ్.