Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : పెళ్లి చేసుకుంటానని నమ్మించి జూనియర్ ఆర్టిస్ట్, యూట్యూబర్ అయిన యువతిపై పలుమార్లు లైంగికదాడి చేసిన ఓ వ్యక్తిపై ఎస్సార్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన యువతి(29)కి 2021లో గుంటూరు జిల్లా కాకాని ప్రాంతానికి చెందిన రోహిత్ఖాన్(24) పరిచయమయ్యాడు. ఆమె 2021 సెప్టెంబరులో నగరానికి వచ్చి జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తూ బోరబండలో ఉంటోంది. ఆ యువతి ఫోన్ నంబరు సంపాదించిన రోహిత్ఖాన్ తరచూ ఆమెకు ఫోన్ చేసేవాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు లైంగికదాడి చేశాడు. ఆమె గర్భం దాల్చింది. తనను పెళ్లి చేసుకొమ్మని బాధితురాలు పలుమార్లు కోరినా తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో బాధితురాలు ఎస్సార్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.