Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఫాస్ట్ బౌలర్ రేణుకా సింగ్ మరోసారి చెలరేగింది. ఓపెనర్ సోఫియా డంక్లే (10)ను బౌల్డ్ చేసింది. దాంతో, 29 పరుగులకే ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. తొలి మూడు వికెట్లు కూడా ఆమెనే తీయడం విశేషం. ప్రధాన బ్యాటర్లు పెవిలియన్ చెలరేగడంతో ఇంగ్లండ్ మరింత కష్టాల్లో పడింది. హీథర్ నైట్ (6), నాట్ సీవర్ బ్రంట్ (17) క్రీజులో ఉన్నారు. ఆరు ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోర్.. 37/3. రేణుక దెబ్బకు ఆ జట్టు పది పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. మూడో ఓవర్లో అలిసే కాప్సేను, ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే ఓపెనర్ వ్యాట్‌ను ఈ ఫాస్ట్ బౌలర్ ఔట్ చేసింది.