Authorization
Tue April 29, 2025 04:21:51 pm
నవతెలంగాణ - పల్నాడు
జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టు పరిసరాల్లో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. అచ్చంపేట మండలం మాదిపాడు, చల్లగరిగ, గింజపల్లి తదితర గ్రామాల్లో ఉదయం 7.26 గంటలకు భూమిలో పెద్ద శబ్దాలు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు.
కొన్ని సెకన్ల పాటు భూమి కంపించినట్లు తెలిపారు. వారం రోజుల్లో రెండు మూడు సార్లు ఇలా జరిగినట్లు తెలిపారు. ఈ తరుణంలో భూప్రకంపనలు రావడంతో పులిచింతల ప్రాజెక్టు సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.