Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - రంగారెడ్డి
జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. హైదరాబాద్ శివారు నార్సింగీలో రాబరీ గ్యాంగ్ పీరం చెరువులో వివాహితను దోపిడీ దొంగలు కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆపై మెడలో ఉన్న రెండు తులాల బంగారం దోచుకున్నారు.
పీరం చెరువు గ్రామం వద్ద ఇద్దరు దుండగులు వివాహితను కారులో కిడ్నాప్ చేశారు. దుండగులు బలవంతంగా వివాహితను కారులో ఎక్కించుకొని కిస్మత్ పూర్ వైపు తీసుకొని వెళ్లి నోరు తెరిస్తే చంపేస్తామంటూ బెదిరించారు. కారును నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లిన దుండగులు తన మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి బలవంతంగా ఆమెకు మద్యం తాగించారు. మత్తులో ఉండగా ఒకరి తరువాత ఒకరు లైంగిక దాడికి చేశారు. రాత్రి సమయంలో మహిళను గండిపేట వద్ద వదిలి వెళ్లి పోయారు.