Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢీల్లి
దేశరాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. భూతవైద్యం పేరుతో ఓ మాంత్రికుడు మైనర్ బాలికపై పలుమార్లు లైంగిక దాడి చేశాడు. బాలిక గర్భం దాల్చడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీకి చెందిన ఓ భూతవైద్యుడు 14 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
బాలికకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆమె తల్లి భూతవైద్యం కోసం ఓ మాంత్రికుడి వద్దకు తీసుకెల్లింది. భూతవైద్యం ముసుగులో నిందితుడు బాలికపై పలుమార్లు లైంగిక దాడి చేశాడు. బాలిక రెండు నెలల గర్భిణి అని తేలడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఢిల్లీ పోలీసులు పోక్సో చట్టం కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు.