Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమృత్సర్
పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో పాకిస్థాన్‌కు చెందిన డ్రోన్ పట్టుబడింది. ఆదివారం ఉదయం 9.15 గంటల సమయంలో గురుదాస్‌పూర్‌లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ జవాన్లు ఓ డ్రోన్ గుర్తించారు. దాని వద్ద భారీసైజులో పార్సిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో పెద్దమొత్తంలో హెరాయిన్ ఉండొచ్చని భావిస్తున్నారు. పాక్ నుంచి భారత్‌లోకి ఆయుధాలు, డ్రగ్స్ సరఫరా చేస్తూ అంతర్జాతీయ సరిహద్దుల్లో తరచుగా డ్రోన్లు పట్టుబడుతున్నాయి. ఈక్రమంలో గురుదాస్‌పూర్‌లోని సరిహద్దుల్లో ఉన్న ఫెన్సింగ్ సమీపంలో డ్రోన్ ఉండటాన్ని బీఎస్ఎఫ్ జవాన్లు గుర్తించారని అధికారులు తెలిపారు. దాని వద్ద ఓ కాంటర్బండ్ లభించిందని చెప్పారు. అందులో ఏముందనే విషయం ఇంకా తెలియరాలేదు.
కాగా, శనివారం సరిహద్దుల్లోని ఖసావాలి గ్రామం వద్ద పాకిస్థానీ స్మగ్లర్ల కదలికలను బీఎస్ఎఫ్ జవాన్లు గుర్తించారు. ఈ క్రమంలో ఇరుపక్షాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల అనంతరం ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు గాలింపుచేపట్టాయి. దీంతో ఫెన్సింగ్‌కు 30 మీటర్ల దూరంలో 15 అడుగుల పొడవున్న ఓ పైపును గుర్తించారు. దానిగుండా హెరాయిన్, ఆయుధాలను సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా 20 ప్యాకెట్లలో హెరాయిన్, రెండు తుపాకులు, ఆరు మ్యాగజైన్లు, 242 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.