Authorization
Wed April 30, 2025 03:01:11 am
నవతెలంగాణ - హైదరాబాద్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న (72) కన్నుమూశారు. గతకొంతకాలంగా గుండె, కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సాయన్న టీడీపీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఐదుసార్లు కంటోన్మెంట్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. సాయన్న టీడీపీ తరఫున 1994, 1999, 2004, 2014 ఎన్నికల్లో గెలిచారు. 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకరరావు చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. 2014 తర్వాత సాయన్న బీఆర్ఎస్లో చేరారు. 2018 ఎన్నికల్లో ఆయన ఆ పార్టీ తరఫునే కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.