Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ద్రవ్యోల్బణం గరిష్ఠస్థాయిలో కొనసాగుతుండడం, వడ్డీ రేట్ల పెంపు సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 18 పాయింట్ల నష్టంతో 60,672 వద్ద ముగిసింది. నిఫ్టీ 17 పాయింట్ల నష్టంతో 17,826 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లలో ఒడిదుడుకులు కూడా భారత స్టాక్ మార్కెట్ ను ప్రభావితం చేశాయి. ఉదయం సెషన్ లో సెన్సెక్స్ లాభాలతోనే ప్రారంభమైనా... ట్రేడింగ్ కొనసాగేకొద్దీ ప్రతికూలతలు సూచీలను దెబ్బతీశాయి. ఇవాళ్టి ట్రేడింగ్ లో రిలయన్స్, హెచ్ డీఎఫ్ సీ, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ షేర్లు లాభాలు అందుకున్నాయి. బజాజ్ ఫిన్ సర్వ్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, విప్రో, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్ సీఎల్ టెక్, టీసీఎస్, టెక్ మహీంద్రా షేర్లు నష్టాలు చవిచూశాయి.