Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని కుంబి శివారు ప్రాంతంలో గల చేనులో లేగదూడపై చిరుత దాడి చేసి చంపేసింది. చుచుంద్ గ్రామానికి చెందిన రైతు రాజేశ్ తన లేగదూడను కుంబి శివారులోని సొంత చేనులో సోమవారం సాయంత్రం కట్టేసి ఇంటికి వెళ్లాడు. సోమవారం రాత్రి దూడపై చిరుతపులి దాడి చేసి చంపేసింది. మంగళవారం ఉదయం చేనుకు వెళ్లిన రాజేశ్‌కు, లేగ దూడ కళేబరం కనిపించింది. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. చిరుతపులి దాడిలో మృతి చెందినట్లు పశువైద్యాధికారి విఠల్ ఆధ్వర్యంలో అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. చిరుత సంచారం నేపథ్యంలో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని వారు కోరారు.